
India’s biggest Scam Exposed - Dr k A Paul
Dr k A Paul is exposing C M Revanth Reddy 5 lakh crore 9292 acres illegal land scam . India’s biggest scam must be stopped by Telangana High Court and ALL Poltical Parties including BRS & BJP. Today Dr Paul filed a Public Interest Litigation in Telangana High Court to stay the sale and Save the State . S R Number W. P. (PIL)54400/2025. Must share to every Indian loving citizen.

కొండారెడ్డి పల్లీలో సర్పంచ్‌గా సీఎం క్లాస్‌మేట్ ఏకగ్రీవ ఎన్నిక
కొండారెడ్డి పల్లీలో సర్పంచ్‌గా సీఎం క్లాస్‌మేట్ ఏకగ్రీవ ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లీ గ్రామ సర్పంచ్ సీఎం రేవంత్ రెడ్డి గారి క్లాస్‌మేట్, చిన్ననాటి మిత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామస్థుల సమ్మతితో ఎలాంటి పోటీ లేకుండానే సర్పంచ్ పదవి దక్కగా, గ్రామంలో ఆనందం వ్యక్తమవుతోంది

సర్పంచిగా ఏకగ్రీవ ఎన్నిక.. రూ.51 లక్షల నిధులు సమకూర్చుతానని హామీ
కొండమల్లేపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిధిలోని చిన్నఅడిశర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా వెంకటయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధి కోసం రూ.52.30 లక్షలు సొంత నిధులు సమకూరుస్తానని ఆయన గ్రామస్థుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని గ్రామంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి వినియోగించాలని గ్రామ పెద్దలు తీర్మానించినట్లు సమాచారం. వాస్తవానికి ఇక్కడ మూడో విడతలో ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కువైట్‌లో వైఎస్సార్ కడప జిల్లా వాసి మృతి..
పోరుమామిళ్ల: వైఎస్సార్ కడప జిల్లా వాసి కువైట్లో గుండెపోటుతో మృతి చెందాడు. పోరుమామిళ్ల మండలం పెద్ద ఎర్రసాల గ్రామానికి చెందిన సూరే సుబ్బయ్య (40) ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లాడు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో అతడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పుకచ్చారు. సుబ్బయ్య 2017లో ఎంబీఏ పూర్తి చేసి ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడి భార్య కోమల బీటెక్ చేసి అదే ప్రాంతంలో అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్నారు. మృతుడి తమ్ముడు ప్రసాద్ కూడా అక్కడే ఉపాధి పనులు చేసుకుంటూ వీరితో పాటు ఉంటున్నాడు. సుబ్బయ్య మృతి వార్తతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు.

India deploys 80 NDRF personnel in cyclone-hit Sri Lanka
India on Saturday deployed 80 NDRF personnel and four search dogs to Sri Lanka to assist with relief and rescue operations following severe floods caused by Cyclone Ditwah, an official said. The team, divided into two units, left from Hindon airbase near Delhi around 4 a.m. on an IL-76 IAF aircraft bound for Colombo. They are carrying inflatable boats, hydraulic cutting and breaching tools, communication equipment, first-aid kits, and other rescue supplies. The mission is part of Operation Sagar Bandhu, launched by India to support Sri Lanka in the aftermath of the cyclone.

పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షురాలు దేవిప్రసన్న
పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షురాలు దేవిప్రసన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికైన తోట దేవిప్రసన్న శుక్రవారం హైదరాబాదులో పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఎంతో నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు మహేష్ కుమార్ గౌడ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ భద్రాద్రి డీసీసీ అధ్యక్షులు తోట దేవిప్రసన్న ను అభినందించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకుల్ని అందరిని కలుపుకొని వెళ్ళాలని, ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, పార్టీని బూత్ స్థాయి నుంచి బలపర్చేందుకు కృషి చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా కార్యాచరణ తయారు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఆమె వెంట యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, కాంగ్రెస్ పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ ఉన్నారు

ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు - ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS
పత్రికా ప్రకటన తేది: 28.11.2025 జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోండి. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు. నిర్భయంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారి దిశానిర్దేశం. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారు ఈరోజు జిల్లాలోని పోలీస్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మూడు దశల్లో జరగనున్న ఎన్నికల ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు మరియు బందోబస్తుపై అధికారులకు ఆమె స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా 582 గ్రామాలలోని 608 పోలింగ్ లొకేషన్ లలో ఉన్న 4956 పోలింగ్ స్టేషన్ లలో ఎన్నికలు జరుగుతాయి అని, ఈ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఎస్పీ గారు సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున,నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు రవాణా జరిగే ఆస్కారం ఉన్నందున తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. ముఖ్యంగా ఎస్.ఎస్.టి (SST) మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లను ముందుగానే గుర్తించి, అక్కడ అదనపు బలగాలను మోహరించాలని, నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. జిల్లాలో శాంతికి విఘాతం కలిగించే పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, ఎలక్షన్ సస్పెక్ట్స్ మరియు అనుమానితులను గుర్తించి వారిని ముందుగానే బైండోవర్ చేయాలని ఆదేశించారు. అలాగే, గన్ లైసెన్స్ కలిగిన వ్యక్తుల నుండి వెంటనే ఆయుధాలను డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ పరిధిలోని ప్రతి పోలింగ్ లొకేషన్‌ను స్వయంగా సందర్శించి భద్రతా పరమైన లోపాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధుల పట్ల అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని, విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు. పోలింగ్ సిబ్బందితో మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో పోలీస్ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పించడమే పోలీస్ శాఖ అంతిమ లక్ష్యమని ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్ గారు, డిటిసి డిఎస్‌పి శ్రీనివాస్ గారు, వికారాబాద్ డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి గారు, తాండూర్ డిఎస్‌పి ఎన్.యాదయ్య గారు, పరిగి డిఎస్‌పి శ్రీనివాస్ గారు,జిల్లా లోని పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Super Wood: సూపర్ వుడ్.. ఉక్కును మించిన చెక్క
న్యూయార్క్, నవంబరు 25: ఉక్కు అంటేనే శక్తికి, గట్టిదనానికి ప్రతీక! అలాంటి ఉక్కు కన్నా శక్తిమంతమైన.. అల్యూమినియం కన్నా తేలికైన, పర్యావరణహితమైన చెక్క ఆధారిత ఉత్పత్తిని అమెరికాలోని మేరీల్యాండ్ వర్సిటీ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. ప్రకృతి సిద్ధమైన సాధారణ చెక్కనే రసాయన, యాంత్రిక మార్పులకు గురిచేయడం ద్వారా దాన్ని వారు కొన్ని పారిశ్రామిక లోహాల కన్నా మరింత బలంగా, దృఢంగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘సూపర్ వుడ్’గా మార్చగలిగారు. ఉక్కు బరువుతో పోలిస్తే ఆ చెక్క బరువు ఆరోవంతే! కానీ.. శక్తి మాత్రం ఉక్కుకన్నా 10 రెట్లు ఎక్కువ. సహజంగా భూమిలో కలిసిపోయే పదార్థం కావడంతో పర్యావరణానికి హానికరం కాదు. సూపర్‌వుడ్ తయారీలో భాగంగా తొలుత మామూలు చెక్కను తీసుకుని దానిలోని కొన్ని ముఖ్యమైన భాగాలను ముందుగా తొలగిస్తారు. చెక్కలో ముఖ్యమైన భాగాలు.. సెల్యులోజ్, హెమీసెల్యులోజ్, లిగ్నిన్. వీటిలో లిగ్నిన్.. చెక్కకు గోధుమ రంగును, గట్టిదనాన్ని ఇస్తుంది. ఈ మూడింటిలో.. లిగ్నిన్‌ను ఎక్కువగా, హెమీసెల్యులోజ్‌ను కొంతమేర తొలగిస్తారు. దీంతో చెక్క మృదువుగా తయారవుతుంది. అనంతరం అధిక ఒత్తిడి, ఎక్కువ ఉష్ణోగ్రత ఉపయోగించి ఆ చెక్కను కంప్రెస్ చేస్తారు. దీంతో చెక్కలో ఉండే సూక్ష్మతంతువులన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయేంత దగ్గరగా జరిగి ఆ చెక్క అత్యధిక సాంద్రత కలిగిన బ్లాకుగా మారుతుంది. అదే పరిమాణంలో ఉన్న చెక్కతో పోలిస్తే.. ఈ సూపర్ వుడ్ దృఢత్వం 3 నుంచి 10 రెట్లు ఎక్కువగా, ఉక్కుతో సమానంగా లేదా అంతకు మించి ఉంటుందని మేరీల్యాండ్ వర్సిటీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అదే సమయంలో.. ఈ చెక్క బరువు ఆయా లోహాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడం గమనార్హం. ఇక.. సాధారణ చెక్క కంప్రెసివ్ స్ట్రెంత్ (అంటే చెక్కను ఎంత గట్టిగా నొక్కితే అది విరుగుతుందో తెలిపే బలం).. 35 ఎంపీఏ(మెగాపాస్కల్)గా ఉంటుంది. కానీ ఈ సూపర్‌వుడ్ కంప్రెసివ్ బలం ఏకంగా 160 ఎంపీఏ. కాగా.. ఈ పరిశోధన ప్రయోగశాలలకే పరిమితం కాలేదు. ‘ఇన్వెంట్‌వుడ్’ అనే కంపెనీని ప్రత్యేకంగా స్థాపించి.. ఈ సూపర్ వుడ్‌ను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించారు.

Dil Raju: దిల్ రాజుకు గోల్డెన్ డీల్.. సంక్రాంతి కింగ్ మరోసారి చక్రం తిప్పబోతున్నాడా?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి సంక్రాంతి కింగ్ గా మారబోతున్నాడా? పాత అప్పులన్నీ తీరే జాక్ పాట్ ఆయనకు తగిలిందా? అంటే అవుననే అంటోంది టాలీవుడ్. మోస్ట్ అవెయిటెడ్ మూవీ దిల్ రాజు ఖాతాలోనే చేరడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రవిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ ను క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట మరింత బజ్ ను తీసుకువచ్చింది. 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బిజినెస్ అప్పుడే మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ బిజినెస్ నంబర్స్ బయటకు వచ్చాయి. 'మన శంకర వరప్రసాద్ గారు' నిజాం రైట్స్‌ను నిర్మాత దిల్ రాజు రూ. 32 కోట్లకు కొనుగోలు చేశాడట. ఇది ఆయనకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశముందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. సంక్రాంతి అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి బిగ్ సీజన్. ఫ్యామిలీ ఆడియన్స్ భారీ సంఖ్యలో థియేటర్లకు వస్తారు. మెగాస్టార్ చిరంజీవి తన రీ-ఎంట్రీ తర్వాత సంక్రాంతికి ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అలాగే డైరెక్టర్ అనిల్ రవిపూడికి కూడా సంక్రాంతి గోల్డెన్ సీజన్... ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రవిపూడి ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మౌత్ టాక్ వస్తే నిజాంలో ఈ సినిమా రూ. 40 కోట్ల షేర్ వసూలు చేయడం అస్సలు కష్టమే కాదు. అయితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాతో పాటు మరో పాన్ ఇండియా బిగ్గీ ‘ద రాజా సాబ్’ సహా పలు సినిమాలు వస్తున్నాయి. కాబట్టి స్క్రీన్ కౌంట్ సైతం ఇందులో కీలక పాత్ర పోషించబోతోంది. ఆల్రెడీ దిల్ రాజే నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కొంచెం డౌన్ ఫేజ్‌లో ఉన్న దిల్ రాజుకి ఈ రెండు సినిమాలు జాక్‌పాట్ డీల్స్ కాబోతున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఫిల్మ్‌నగర్‌లో మోడల్ ఫుట్‌పాత్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ
ఫిల్మ్‌నగర్‌లో మోడల్ ఫుట్‌పాత్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ – రూ. కోటి 68 లక్షలతో 1.5 కిలో మీటర్ మేర పర్యావరణహిత ప్లాస్టిక్ పేవర్ బ్లాకులతో ఫుట్‌పాత్‌ల నిర్మాణం – ఫుట్‌పాత్‌ల కోసం ప్రత్యేక సోలార్ గ్రిడ్ – పాదచారుల భద్రతకు అధిక ప్రాధాన్యం. అంధులు,వృద్ధులకు సౌకర్యంగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం హైదరాబాద్, నవంబర్ 27,2025: పాదచారుల భద్రత, సౌకర్యం మెరుగుపరచడం,వీధినీ సుందరంగా తీరిదిద్దడమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో మోడల్ ఫుట్‌పాత్ అభివృద్ధి పనులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ సర్కిల్-18, ఖైరతాబాద్ జోన్ పరిధిలోని రామానాయుడు స్టూడియో – రోడ్ నెం. 79/82 జంక్షన్ నుండి BVB జంక్షన్, CVR ఛానల్, రోడ్ నెం. 82 వరకు పాదచారుల రద్దీ అధికంగా ఉండే 1500 మీటర్ల పొడవైన మార్గాన్ని కవర్ చేస్తుంది. ఇందులో ఎడమ వైపు (LHS) 1000 మీటర్లు, కుడి వైపు (RHS) 500 మీటర్లు అభివృద్ధికి ప్రణాళికలను జిహెచ్ఎంసి రూపొందించింది. ఇందుకోసం మొత్తం రూ. 1 కోటి 68 లక్షలు వెచ్చించనున్నారు. వచ్చే 4 నెలల్లోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణహిత ప్లాస్టిక్ పేవర్ బ్లాకులు జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఫుట్‌పాత్‌లో ప్లాస్టిక్ పేవర్ బ్లాకులను ఉపయోగించబడుతోంది. ఈ బ్లాకులు: * 65–70% పోస్ట్-కన్స్యూమర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు అవుతాయి * 35 MPa కంప్రెషన్ బలం కలిగి ఉంటాయి * 225 mm × 112 mm × 50 mm (జిగ్-జాగ్ ప్యాటర్న్) పరిమాణంలో ఉంటాయి * సాధారణ కాంక్రీట్ పేవర్‌లకు సరిసమానమైన దృఢత్వంను అందిస్తాయి * భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి పర్యావరణాన్ని కాపాడటానికి తోడ్పడతాయి స్మార్ట్ ఫుట్‌పాత్ కోసం సోలార్ గ్రిడ్ ఫుట్‌పాత్ పైభాగంలో 10 kWp సామర్థ్యం గల సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా: * 600Wp లేదా అంతకంటే పై రేటెడ్ సోలార్ మాడ్యూల్స్ (Renewsys/Saatvik/Emmvee) * 10 kW గ్రిడ్-టైడ్ ఇన్వర్టర్ (Solis/GoodWe/Sungrow) * 8–10 అడుగుల ఎత్తులో MS మౌంటింగ్ స్ట్రక్చర్ * ఆటోమేటెడ్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్ * AC & DC డిస్ట్రిబ్యూషన్ బాక్స్‌లు, లైట్నింగ్ అరెస్టర్ & ఎర్తింగ్ * అన్ని ఎలక్ట్రికల్ కనెక్షన్లు, ఇన్‌స్టాలేషన్ & కమిషనింగ్ ఈ సోలార్ పందిరి ( రూప్ టాప్ ) పాదచారుల భద్రతను పెంచడంతో పాటు సౌరశక్తి ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దివ్యాంగులకు అనుకూలంగా టాక్టైల్ పేవర్‌లు ( స్పర్శ సంబంధిత టైల్స్) దృష్టిలోపం ఉన్నవారికి, వృద్ధులకు మార్గనిర్ధేశం చేసేలా టాక్టైల్ పేవర్‌లు మరియు గైడ్ బార్లు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఫుట్‌పాత్ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. –––––––––––––––––––– పిఆర్ఓ, జీహెచ్ఎంసీ కార్యాలయంచే జారీ చేయనైనది.

India Versus South Africa 2025: రోజంతా నిలుస్తారా
గువాహటి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ ఓటమి తప్పేలా లేదు. ఇక జట్టు పోరాటమంతా డ్రా కోసమే. భారత బ్యాటర్లు బేలగా మారిన పిచ్‌పై నాలుగో రోజున దక్షిణాఫ్రికా మాత్రం అదరగొట్టింది. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా బరిలోకి దిగిన సఫారీలు తమ రెండో ఇన్నింగ్స్‌ను 260/5 స్కోరు వద్ద డిక్లేర్ చేశారు. దీంతో ఆ జట్టుకు 548 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. స్టబ్స్ (94) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. డి జోర్జి (49), రికెల్టన్ (35), ముల్డర్ (35 నాటౌట్) మార్‌క్రమ్ (29) రాణించారు. స్పిన్నర్ జడేజాకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 549 పరుగుల ఛేదనలో భారత్ మంగళవారం ఆట ముగిసే సమయానికి 15.5 ఓవర్లలో 27/2 స్కోరుతో నిలిచింది. జైస్వాల్ (13), రాహుల్ (6) నిరాశపర్చారు. క్రీజులో ఉన్న కుల్దీప్ (4 బ్యాటింగ్), సుదర్శన్ (2 బ్యాటింగ్) పరుగులు తీసేందుకు చెమటోడ్చుతున్నారు. విజయం కోసం భారత్ మరో 522 పరుగు లు చేయాల్సి ఉండగా, ఆఖరి రోజును అజేయంగా ముగించి డ్రా చేసుకోగలుగుతారా? అనేది వేచిచూడాల్సిందే

Gold rates on Nov 27: బంగారం ధరల్లో సూపర్ ర్యాలీ
ఇంటర్నెట్ డెస్క్: గత రెండు రోజుల వ్యవధిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. సుమారు రూ.2700 మేర ఎగబాకాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లల్లో కోత తప్పదన్న అంచనాలతో ధరలకు రెక్కలొచ్చాయి. డాలర్ బలహీనపడటం కూడా ధరల పెరుగుదలకు దారితీసింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.30 గంటలకు భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,27,920కు చేరింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,17,920కు ఎగబాకింది. వెండి ధరలు కూడా గత రెండు రోజుల్లో రూ.6 వేలకు పైగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.1,69,100కు చేరింది (Gold, Silver Rates on Nov 27). అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు బలపడటం ఈ ర్యాలీకి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్‌లో జరిగే మీటింగ్‌లో వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్స్ మేర కోత పడే ఛాన్స్ ఉందని ఫెడ్ అధికారులు సంకేతాలిచ్చారు. దీనికి తోడు డాలర్ కూడా బలహీనపడింది. డాలర్ సూచీ 100 మార్కు దిగువకు చేరింది. ఫలితంగా బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. అయితే, ఈ జోష్ స్వల్ప కాలికమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేరడంతో భౌగోళికరాజకీయ అనిశ్చితులు తొలగుతున్నాయి. దీంతో, సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మళ్లీ డిమాండ్ తగ్గి స్టాక్స్‌లోకి పెట్టుబడుల వరద పెరిగే ఛాన్స్ ఉంది.

కొన్ని నిమిషాలు అయితే ప్రాణం పోయేది
సెల్యూట్ హోమ్ గార్డ్ కొన్ని సెకండ్స్ లో రెస్పాండ్ అయ్యాడు ప్రాణం కాపాడాడు. యువ రైతు ప్రాణం ను కాపాడిన హోంగార్డ్. నీ ధైర్యానికి నీ రెస్పాండ్ కు సెల్యూట్ పవన్ కుమార్. కమాన్ పైకి ఎక్కాడు రైతు ప్రాణం ను కాపాడాడు. ఉరి తాడును లాక్కున్నాడు రైతును నచ్చ చెప్పాడు. కొన్ని నిమిషాలు అయితే ప్రాణం పోయేది. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేట్ కమాన్ పై ఎక్కి యువరైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు వెంటనే స్పందించి ప్రాణం కాపాడిన హోంగార్డ్ పవన్ కుమార్.

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్ మీనా.
వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, చేవెళ్ల శంకర్ పల్లి రూట్లో ఒక ప్రయాణికురాలు బస్సులో తన బ్యాగు మర్చిపోవడం జరిగినది.అందులో సుమారు రెండు లక్షల రూపాయల వరకు డబ్బులు ఉన్నాయని పోగొట్టుకున్న మహిళ వాపోయింది.తిరిగి ఇట్టి డబ్బుని గుర్తించి,కండక్టర్ మీనా అట్టి ప్రయాణికురాలికి డబ్బు తిరిగి ఇవ్వడం జరిగింది. ఇది కండక్టర్ మీనా నిజాయితీకి మారుపేరు. కండక్టర్ మీనా

Sukumar: ఇద్దరు మెగా హీరోలు.. పదేండ్లు! సుక్కూ డైరీ.. 2030 వరకూ ఫుల్
దర్శకుడు సుకుమార్ (Sukumar) పదేళ్లకు పైగా మెగా ఫ్యామిలీకే అంకితమయ్యారు. రామ్‌చరణ్ (Ram charan) హీరోగా ఆయన దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రంగస్థలం’ 2018లో విడుదలైంది. తదుపరి పుష్ప ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యారు. 2021లో ఆ చిత్రం విడుదలైంది. ఆ వెంటనే పుష్ప-2 (Pushpa 2) కంటిన్యూ చేశారు. గత ఏడాది ఆ సినిమా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నారు. ‘పెద్ది’ తర్వాత ఆ సినిమా షురూ కానుంది. రామ్‌చరణ్, సుకుమార్ బ్రాండ్ నుంచి సినిమాకావడంతో అంచనాలు భారీగా ఉంటాయి. తదుపరి మళ్లీ పుష్ఫ ఫ్రాంఛైజీలోకి వచ్చి పుష్ప-3:ర్యాంపేజ్‌కు సిద్ధమవతారుఈ విషయాన్ని నిర్మాతలే స్వయంగా వెల్లడించారు. ఈ విషయాన్ని నిర్మాత మైత్రీ రవి ప్రకటించారు. ‘సుకుమార్, చరణ్‌గారి సినిమా చేస్తున్నాం. ఇది మంచి కాన్టెంపరరీ స్టోరీ. ఈసారి రంగస్ఘలాన్ని మించి ఉంటుంది. ఈ సినిమా అయిన తర్వాత 2027లో పుష్ప 3 మొదలు పెడతాం. ఇప్పటికే సుకుమార్ గారు పుష్ప 3 వర్క్ చేశారు. కథ చాలా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు. ఇలా చూస్తే సుకుమార్ డైరీ మొత్తం 2031 వరకూ ఫుల్ అయిపోయింది. ఈ పదేళ్లలో సుక్కూ మెగా హీరోలు ఇద్దరితో మాత్రమే పని చేశారు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం గమనార్హం.