సర్పంచిగా ఏకగ్రీవ ఎన్నిక.. రూ.51 లక్షల నిధులు సమకూర్చుతానని హామీ

సర్పంచిగా ఏకగ్రీవ ఎన్నిక.. రూ.51 లక్షల నిధులు సమకూర్చుతానని హామీ

Last updated by: Deepak

Last updated at: Nov 29, 2025, 10:36 AM

కొండమల్లేపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిధిలోని చిన్నఅడిశర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా వెంకటయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధి కోసం రూ.52.30 లక్షలు సొంత నిధులు సమకూరుస్తానని ఆయన గ్రామస్థుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని గ్రామంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి వినియోగించాలని గ్రామ పెద్దలు తీర్మానించినట్లు సమాచారం. వాస్తవానికి ఇక్కడ మూడో విడతలో ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.