కువైట్‌లో వైఎస్సార్‌ కడప జిల్లా వాసి మృతి..

కువైట్‌లో వైఎస్సార్‌ కడప జిల్లా వాసి మృతి..

Last updated by: Nagesh

Last updated at: Nov 29, 2025, 09:50 AM

పోరుమామిళ్ల: వైఎస్సార్ కడప జిల్లా వాసి కువైట్లో గుండెపోటుతో మృతి చెందాడు. పోరుమామిళ్ల మండలం పెద్ద ఎర్రసాల గ్రామానికి చెందిన సూరే సుబ్బయ్య (40) ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లాడు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో అతడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పుకచ్చారు. సుబ్బయ్య 2017లో ఎంబీఏ పూర్తి చేసి ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడి భార్య కోమల బీటెక్ చేసి అదే ప్రాంతంలో అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్నారు. మృతుడి తమ్ముడు ప్రసాద్ కూడా అక్కడే ఉపాధి పనులు చేసుకుంటూ వీరితో పాటు ఉంటున్నాడు. సుబ్బయ్య మృతి వార్తతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు.

కువైట్‌లో వైఎస్సార్‌ కడప జిల్లా వాసి మృతి..