
Gold rates on Nov 27: బంగారం ధరల్లో సూపర్ ర్యాలీ
Last updated by: Rayhaan Shareef
Last updated at: Nov 28, 2025, 09:10 AM
ఇంటర్నెట్ డెస్క్: గత రెండు రోజుల వ్యవధిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. సుమారు రూ.2700 మేర ఎగబాకాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లల్లో కోత తప్పదన్న అంచనాలతో ధరలకు రెక్కలొచ్చాయి. డాలర్ బలహీనపడటం కూడా ధరల పెరుగుదలకు దారితీసింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.30 గంటలకు భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,27,920కు చేరింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,17,920కు ఎగబాకింది. వెండి ధరలు కూడా గత రెండు రోజుల్లో రూ.6 వేలకు పైగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.1,69,100కు చేరింది (Gold, Silver Rates on Nov 27). అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు బలపడటం ఈ ర్యాలీకి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్‌లో జరిగే మీటింగ్‌లో వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్స్ మేర కోత పడే ఛాన్స్ ఉందని ఫెడ్ అధికారులు సంకేతాలిచ్చారు. దీనికి తోడు డాలర్ కూడా బలహీనపడింది. డాలర్ సూచీ 100 మార్కు దిగువకు చేరింది. ఫలితంగా బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. అయితే, ఈ జోష్ స్వల్ప కాలికమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేరడంతో భౌగోళికరాజకీయ అనిశ్చితులు తొలగుతున్నాయి. దీంతో, సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మళ్లీ డిమాండ్ తగ్గి స్టాక్స్‌లోకి పెట్టుబడుల వరద పెరిగే ఛాన్స్ ఉంది.