
ఫిల్మ్‌నగర్‌లో మోడల్ ఫుట్‌పాత్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ
Last updated by: Rayhaan Shareef
Last updated at: Nov 28, 2025, 09:11 AM
ఫిల్మ్‌నగర్‌లో మోడల్ ఫుట్‌పాత్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ – రూ. కోటి 68 లక్షలతో 1.5 కిలో మీటర్ మేర పర్యావరణహిత ప్లాస్టిక్ పేవర్ బ్లాకులతో ఫుట్‌పాత్‌ల నిర్మాణం – ఫుట్‌పాత్‌ల కోసం ప్రత్యేక సోలార్ గ్రిడ్ – పాదచారుల భద్రతకు అధిక ప్రాధాన్యం. అంధులు,వృద్ధులకు సౌకర్యంగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం హైదరాబాద్, నవంబర్ 27,2025: పాదచారుల భద్రత, సౌకర్యం మెరుగుపరచడం,వీధినీ సుందరంగా తీరిదిద్దడమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో మోడల్ ఫుట్‌పాత్ అభివృద్ధి పనులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ సర్కిల్-18, ఖైరతాబాద్ జోన్ పరిధిలోని రామానాయుడు స్టూడియో – రోడ్ నెం. 79/82 జంక్షన్ నుండి BVB జంక్షన్, CVR ఛానల్, రోడ్ నెం. 82 వరకు పాదచారుల రద్దీ అధికంగా ఉండే 1500 మీటర్ల పొడవైన మార్గాన్ని కవర్ చేస్తుంది. ఇందులో ఎడమ వైపు (LHS) 1000 మీటర్లు, కుడి వైపు (RHS) 500 మీటర్లు అభివృద్ధికి ప్రణాళికలను జిహెచ్ఎంసి రూపొందించింది. ఇందుకోసం మొత్తం రూ. 1 కోటి 68 లక్షలు వెచ్చించనున్నారు. వచ్చే 4 నెలల్లోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణహిత ప్లాస్టిక్ పేవర్ బ్లాకులు జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఫుట్‌పాత్‌లో ప్లాస్టిక్ పేవర్ బ్లాకులను ఉపయోగించబడుతోంది. ఈ బ్లాకులు: * 65–70% పోస్ట్-కన్స్యూమర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు అవుతాయి * 35 MPa కంప్రెషన్ బలం కలిగి ఉంటాయి * 225 mm × 112 mm × 50 mm (జిగ్-జాగ్ ప్యాటర్న్) పరిమాణంలో ఉంటాయి * సాధారణ కాంక్రీట్ పేవర్‌లకు సరిసమానమైన దృఢత్వంను అందిస్తాయి * భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి పర్యావరణాన్ని కాపాడటానికి తోడ్పడతాయి స్మార్ట్ ఫుట్‌పాత్ కోసం సోలార్ గ్రిడ్ ఫుట్‌పాత్ పైభాగంలో 10 kWp సామర్థ్యం గల సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా: * 600Wp లేదా అంతకంటే పై రేటెడ్ సోలార్ మాడ్యూల్స్ (Renewsys/Saatvik/Emmvee) * 10 kW గ్రిడ్-టైడ్ ఇన్వర్టర్ (Solis/GoodWe/Sungrow) * 8–10 అడుగుల ఎత్తులో MS మౌంటింగ్ స్ట్రక్చర్ * ఆటోమేటెడ్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్ * AC & DC డిస్ట్రిబ్యూషన్ బాక్స్‌లు, లైట్నింగ్ అరెస్టర్ & ఎర్తింగ్ * అన్ని ఎలక్ట్రికల్ కనెక్షన్లు, ఇన్‌స్టాలేషన్ & కమిషనింగ్ ఈ సోలార్ పందిరి ( రూప్ టాప్ ) పాదచారుల భద్రతను పెంచడంతో పాటు సౌరశక్తి ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దివ్యాంగులకు అనుకూలంగా టాక్టైల్ పేవర్‌లు ( స్పర్శ సంబంధిత టైల్స్) దృష్టిలోపం ఉన్నవారికి, వృద్ధులకు మార్గనిర్ధేశం చేసేలా టాక్టైల్ పేవర్‌లు మరియు గైడ్ బార్లు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఫుట్‌పాత్ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. –––––––––––––––––––– పిఆర్ఓ, జీహెచ్ఎంసీ కార్యాలయంచే జారీ చేయనైనది.