
రెండు వేర్వేరు కుటుంబాలకు బియ్యం పంపణీ చేసిన భూంపల్లి బహుజన మిత్రులు!
Last updated by: Nagesh
Last updated at: Dec 17, 2025, 06:55 AM
భూంపల్లి: డిసెంబర్ 17 2025 సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లి గ్రామం ముదిరాజ్ కులానికి చెందిన, కర్ణాల నర్సవ్వ , మరియు నీల రామయ్యలు గత ఐదురోజుల కింద అనారోగ్యం కారణంగా చనిపోయిన విషయం తెలిసి, బహుజన మిత్రులు వారి ఇరువురు కుటుంబాలను కలిసి పరామర్శించడం జరిగింది. సామాజిక సేవలో భాగంగా వారి కుటుంబాలకు చేయుతగా 50 కేజీల చొప్పున,1 క్వింటలు బియ్యన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బహుజన మిత్రులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.