
వీగన్ ఉత్పత్తులపై ప్రత్యేక లోగో.. FSSAI కీలక నిర్ణయం
Author: Pavan
Last updated at: Jun 5, 2026, 11:08 AM
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వీగన్ ఆహార ఉత్పత్తులను సులభంగా గుర్తించేందుకు కొత్త వీగన్ లోగోను ప్రవేశపెట్టింది. ఆమోదం పొందిన అన్ని వీగన్ ఉత్పత్తుల ప్యాకేజీలపై ఈ లోగో తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. 2027 జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధన వినియోగదారుల విశ్వాసం, పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా తీసుకొచ్చినట్లు పేర్కొంది