
అఫ్గాన్‌తో వన్డేలకు కోహ్లి అందుబాటులో లేడా?
Author: Pavan
Last updated at: Jun 4, 2026, 07:18 AM
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తొడ కండరాల గాయంతో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. జూన్ 13 నుంచి 20 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఇటీవల ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లి, మ్యాచ్ సందర్భంగా నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఫిజియో సహాయంతో చివరివరకు బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రస్తుతం అతని ఫిట్‌నెస్‌పై బీసీసీఐ పర్యవేక్షిస్తోంది.