
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు
Author: Pavan
Last updated at: Jun 4, 2026, 08:00 AM
అమీర్‌పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తులోని ఎంఎస్‌ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో చెలరేగిన మంటలు ఇతర షాపులకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా దుకాణాలను ఖాళీ చేయించారు. ఘటనతో ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.