బ్లాక్ టీషర్ట్‌తో బీఆర్ఎస్ రచ్చ.. అసెంబ్లీ గేటు వద్ద హైడ్రామా!

బ్లాక్ టీషర్ట్‌తో బీఆర్ఎస్ రచ్చ.. అసెంబ్లీ గేటు వద్ద హైడ్రామా!

Author: Pavan

Last updated at: Sep 7, 2026, 05:49 AM

అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నినాదాలున్న బ్లాక్ టీషర్టులతో వచ్చిన నేతలను అనుమతించలేదు. దీంతో హరీశ్ రావు టీషర్ట్ విప్పి, ఎమ్మెల్యేలు బనియన్లతోనే నిరసన తెలిపారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకోగా, జగదీశ్ రెడ్డి స్పృహతప్పారు.