
హైడ్రా భారీ ఆపరేషన్.. ₹30 వేల కోట్ల భూమికి రక్షణ
Author: Pavan
Last updated at: Jun 5, 2026, 12:02 PM
హైడ్రా భారీ ఆపరేషన్.. ₹30 వేల కోట్ల భూమికి రక్షణ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పుప్పాలగూడలో ప్రాంతంలో హైడ్రా భారీ చర్యలు చేపట్టింది. ఆక్రమణలకు గురికాకుండా 200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. సహజ వారసత్వ సంపదను పరిరక్షించేందుకు తీసుకున్న ఈ చర్యలను పర్యావరణవేత్తలు స్వాగతిస్తున్నారు. కాగా ఈ భూమి విలువ సుమారు ₹30 వేల కోట్ల వరకు ఉంటుందని హైడ్రా వెల్లడించింది.