
Author: Pavan
Last updated at: Jul 30, 2026, 11:38 AM
తెలంగాణకు సకాలంలో యూరియా ఇవ్వాలి: ఎంపీ వద్దిరాజు ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రైతులకు సకాలంలో ఎరువులు, యూరియా అందించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని కోరారు. పంటల ఎదుగుదల, వ్యవసాయ ఉత్పాదకతకు ఎలాంటి అంతరాయం లేకుండా ఎరువుల సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు వెంటనే అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.